టెక్నోరీచ్ సీఈఓపై వేధింపుల ఆరోపణలు.. కేసు నమోదు
ABN , Publish Date - May 23 , 2026 | 11:41 AM
హైదరాబాద్‌లోని టెక్నోరీచ్ సంస్థ సీఈఓ లక్ష్మీకాంత్ గౌడ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఉద్యోగాల పేరుతో అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు లక్ష్మీకాంత్‌పై ఆరోపణలు వచ్చాయి.
హైదరాబాద్, మే 23: టెక్నోరీచ్ సంస్థ సీఈఓ లక్ష్మీకాంత్ గౌడ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఉద్యోగాల పేరుతో అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు లక్ష్మీకాంత్‌పై ఆరోపణలు వచ్చాయి. ట్రైనింగ్ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మార్చిలో 80 నుంచి 90 మంది ఉద్యోగులను సంస్థ నియమించుకుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్ష్మీకాంత్ వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆఫీస్ అద్దె చెల్లించకపోవడంతో గత నెల 25న కార్యాలయానికి తాళం పడింది.
జీతాల కోసం ప్రశ్నించిన ఉద్యోగిని సీఈఓ దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్లబ్బులు, పబ్బులకు రావాలంటూ మహిళా ఉద్యోగినిపై ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదు వచ్చింది. పెండింగ్ జీతాలు ఇవ్వాలంటే ఒక్కొక్కరు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు లక్ష్మీకాంత్ గౌడ్‌పై బెదిరింపులు, వేధింపులు, మోసం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.100కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్‌లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన ప్రత్యర్థులు..
Read Latest Telangana News And Telugu News