Share News

2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి: కేంద్ర మంత్రి పెమ్మసాని

ABN , Publish Date - May 23 , 2026 | 10:48 AM

గుంటూరు జిల్లాలోని శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తవుతుందని తెలిపారు.

2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి: కేంద్ర మంత్రి పెమ్మసాని
Pemmasani Chandrasekhar

గుంటూరు జిల్లా, మే 23: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు(శనివారం) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ... 2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 6 పిల్లర్ క్యాప్స్ పెట్టారని చెప్పారు. బీహార్ ఎన్నికల వల్ల కార్మికులు అందుబాటులో లేక 20 రోజులు బ్రిడ్జి పనులు ఆలస్యంగా జరిగాయని వివరించారు.


ఇప్పటి నుంచి బ్రిడ్జి పనులను 70 మంది కార్మికులతో శరవేగంగా జరగనున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. వర్షాకాలం సమయానికి 30 పిల్లర్లకు ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరితగతిన పనులు పూర్తి అవుతాయని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకునే అవసరం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ

యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.100కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2026 | 10:53 AM