Share News

అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేద్దాం: మంత్రి లోకేశ్

ABN , Publish Date - May 23 , 2026 | 01:18 PM

అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.

అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేద్దాం: మంత్రి లోకేశ్
Minister Nara Lokesh

అమరావతి, మే 23: అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈరోజు(శనివారం) క్లస్టర్ ఇన్‌ఛార్జిలతో నిర్వహించిన సమావేశంలో మహానాడుకు సంబంధించి మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కార్యకర్తలంతా ఉత్సాహంగా, ఐక్యతగా పాల్గొనాలని సూచించారు. ఈ మహానాడు క్లస్టర్ బలోపేతానికి మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. కేఎస్ఎస్, బూత్, గ్రామ స్థాయి, అనుబంధ కమిటీల సభ్యులందరినీ మహానాడుకు ప్రత్యేకంగా ఆహ్వానించి, వారందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.


పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈసారి హైబ్రిడ్ పద్ధతుల్లో మహానాడును నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో అతితక్కువ మందితో మహానాడును నిర్వహించనున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనున్న మహానాడులో సుమారు 20 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. మహానాడు-2026ను స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి...

2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి: కేంద్ర మంత్రి పెమ్మసాని

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2026 | 01:25 PM