ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా..
ABN , Publish Date - May 23 , 2026 | 02:35 PM
వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అందజేశారు.
అమరావతి: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఈ రోజు (శనివారం) రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన పలు ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పవన్‌కు తెలిపారు.
కొన్ని రోజులుగా హర్ష వీణ, ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ మోసం చేశారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పలు సంచలన వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అరవ శ్రీధర్‌పై తాజాగా మరికొన్ని రాజకీయపరమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే శ్రీధర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేద్దాం: మంత్రి లోకేశ్
నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. జగన్ అండ్ కోకి సీఎం చంద్రబాబు వార్నింగ్