Share News

విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేశ్

ABN , Publish Date - May 09 , 2026 | 11:45 AM

విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేశ్
Minister Nara Lokesh

విజయవాడ, మే 9: ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ దర్శించుకున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం ఆలయానికి వచ్చిన మంత్రికి దేవాదాయ కమిషనర్ రాంచంద్ర మోహన్, ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్ర రాధా కృష్ణ.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం లోకేశ్‌కు వేద పండితులు ఆశీర్వాదం అందించగా... అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు.


లోకేశ్‌ రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని అధికారులకు తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారులు వేమూరి రవి కుమారు కుమారుడు కిరణ్ వివాహ వేడుకల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

విశాఖ కైలాసగిరిపై భారీ త్రిశూలం ప్రారంభం

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2026 | 11:50 AM