ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి భారీ షాక్
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:45 PM
ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ శ్రేణులు భారీగా ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరాయి. ఆదివారం నందిగామలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారంతా టీడీపీలో చేరారు.
నందిగామ, సెప్టెంబర్13: ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ శ్రేణులు భారీగా ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరాయి. ఆదివారం నందిగామలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారంతా టీడీపీలో చేరారు. నందిగామ మండలం బెల్లకొండవారి పాలెంకు చెందిన దాదాపు 15 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సౌమ్య ఆహ్వానించారు. మరో వైపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలతోపాటు కార్యకర్తలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
అలాగే విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల టీడీపీలో చేరిన విషయం విదితమే. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కండువా కప్పి.. వారిని ఆహ్వానించారు. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం వరకు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ
విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..
For More AP News And Telugu News