Share News

సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి: టీడీపీ ఎంపీ లావు

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:17 PM

అకడమిక్ చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరమని ఉందని పాఠశాల విద్యార్థులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సూచించారు. శనివారం విజయవాడలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపునకు డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి: టీడీపీ ఎంపీ లావు

విజయవాడ, సెప్టెంబర్ 05: అకడమిక్ చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరమని ఉందని పాఠశాల విద్యార్థులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సూచించారు. శనివారం విజయవాడలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపునకు డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కోర్టులు, రెవెన్యూ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల పనితీరుపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రేజినాతోపాటు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే పబ్లిక్ సర్వీసెస్‌పై ఆసక్తి పెంచాలని విద్యా్ర్థుల తల్లిదండ్రులకు స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీసెస్ వైపు యువతను ప్రోత్సహించాలని వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులకు సూచించారు. ప్రజాసేవ ద్వారా లక్షలాది మందికి మేలు చేసే అవకాశం కలుగుతుందని వివరించారు.


అధికారులకు సమాజంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతతోపాటు నాయకత్వ లక్షణాలు పెంచాలన్నారు. విద్యార్థుల మనసును అర్థం చేసుకుని వారిని గైడ్ చేసే టీచర్లు ప్రస్తుతం అవసరమని పేర్కొన్నారు. చురుకైన పౌరులుగా యువతను తీర్చిదిద్దడమే డెమోక్రటిక్ సంఘం లక్ష్యమని స్పష్టం చేశారు. నరసరావుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డెమోక్రటిక్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్

నల్లజర్ల పీఎస్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

For More AP News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 01:28 PM