Share News

ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 05 , 2026 | 10:40 AM

కొందరు ఆటో డ్రైవర్లు.. కొద్ది దూరానికి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. ఒకొక్కసారి ఆటోలో కూర్చునే సీట్లు చిరిగిపోయి ఉంటాయి. మరికొన్ని ఆటోల్లో అయితే టాప్ సరిగ్గా ఉండదు.. చిల్లులు చిల్లులు పడి ఉంటుంది.

ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఆటో డ్రైవర్లు.. కొద్ది దూరానికి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. కొన్ని ఆటోల్లో సీట్లు చిరిగిపోయి ఉంటాయి. మరికొన్ని ఆటోల్లో అయితే టాప్ సరిగ్గా ఉండదు.. చిల్లులు చిల్లులు పడి ఉంటుంది. ప్రయాణికుల సౌకరాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. పైసలే పరమావధిగా ఆటో డ్రైవర్లు ఉంటారు. అలాంటి వారిని మనం నిత్యం చూస్తునే ఉంటాం. కానీ మహారాష్ట్రలోని పుణెలో ఓ ఆటో డ్రైవర్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.


సెవన్ సీటర్ ఆటో లోపల అందంగా తయారు చేశాడు. సీసీటీవీ కెమెరా అమర్చాడు. రేడియో కూడా ఏర్పాటు చేశాడు. పెద్ద ఆడియో స్పీకర్లు వాహనం వెనుక భాగంలో ఉంచాడు. అలాగే వాటర్ బాటిల్, చాక్లెట్లు, శానిటైజర్‌‌ను ఉంచాడు. చిన్నపాటి క్యాలెండర్ ఏర్పాటు చేశాడు. ఆటో లోపల వాల్‌‌కు రాధాకృష్ణుడి చిత్రపటాన్ని తగిలించాడు. ఆ పక్కనే అద్దం కూడా ఉంచాడు. అదే విధంగా బబుల్ గన్ ఉంచాడు.


అయితే ఈ ఆటో కేవలం 3 కిలోమీటర్ల మధ్య మాత్రమే తిరుగుతుంది. ఇక ఈ ఆటోలో ప్రయాణం ముగిసిన తర్వాత.. ఫీడ్ బ్యాక్ కోసం ఓ పుస్తకాన్ని కూడా అందులో ఉంచాడు. ఈ ఫీడ్ బ్యాంక్ పుస్తకంలో ఇప్పటికే చాలా మంది వివిధ రకాలుగా స్పందించారు. ఈ వీడియోను teknas.reverse అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.


ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. మరో 2 లక్షల మంది లైక్‌ కొట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ ఆటోలో ప్రయాణిస్తే.. ఒత్తిడిమాయం అవుతుందిని అంటున్నారు. ఈ ఆటోలో ప్రయాణం కొన్ని కిలోమీటర్లే అయినా.. ఎప్పటికీ గుర్తిండేలా ఉంటుందని చెబుతున్నారు. కొంత మంది ఆటో డ్రైవర్లు.. గర్భిణీలకు, వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని గుర్తు చేస్తున్నారు. అలాంటి కోవలోకే ఈ ఆటో డ్రైవర్ వస్తారని పేర్కొంటున్నారు.

Updated Date - Sep 05 , 2026 | 11:49 AM