మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో విషప్రచారం.. టీడీపీ నేతల ఫిర్యాదు
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:09 PM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో వైసీపీ విషప్రచారం చేస్తోందంటూ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వర రావు.. పలువురు టీడీపీ నేతలతో కలిసి గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా, ఆగస్టు 22: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో వైసీపీ విషప్రచారం చేస్తోందంటూ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వర రావు.. పలువురు టీడీపీ నేతలతో కలిసి గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ రావి మాట్లాడుతూ.. వైసీసీ పార్టీ నాయకులపై మండిపడ్డారు. ఆ పార్టీ నేర చరిత్ర కలిగిన నాయకులతో నిండిపోయి, అది గొడ్డలి పార్టీగా మారిపోయిందని ఫైరయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అరాచకాలు, విధ్వంసాలు చేశారని.. ఇప్పుడు అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంటే.. వైసీపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు.
మంత్రి లోకేశ్ నేతృత్వంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావడాన్ని, పిల్లలకు నాణ్యమైన విద్య అందడాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని రావి వ్యాఖ్యానించారు. డీఎస్సీని ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తే, కనీస విజ్ఞత లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీపీఎస్పీ నిర్వహణలో వైసీపీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని, వాటిని ఆధారాలతో సహా సిట్ బయటపెట్టిందని రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏఈఈ నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి... ప్రలోభాలు నమ్మొద్దన్న మంత్రి గొట్టిపాటి
యువతతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం: గోవా సీఎం ప్రమోద్ సావంత్
Read Latest AP News And Telugu News