Share News

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతల వికృత చేష్టలు: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Aug 11 , 2026 | 08:04 AM

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన దీక్షలు, బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు.

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతల వికృత చేష్టలు: మంత్రి కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

మచిలీపట్నం, ఆగస్టు 11: బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన దీక్షలు, బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు. రౌడీలు, గంజాయి బ్యాచ్‌తో ఈ ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. వైసీపీ నిర్వహించిన దీక్షలు, బైక్ ర్యాలీలలో ఎక్కడా కూడా రైతులు, విద్యార్థులు పాల్గొన లేదన్నారు. యువతను నిర్వీర్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ నిప్పులు చెరిగారు.


మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించడం సిగ్గు చేటు అని వైసీపీ నేతల తీరుపై పేర్కొన్నారు. ఐదేళ్ల అధికారంలో ఒక్క మెగా డీఎస్సీ అయినా నిర్వహించారా..? అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. వైసీపీ పిలుపునిచ్చే నిరసన కార్యక్రమాలకు ప్రజలు ఎవ్వరూ రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశామని చెప్పారు. నెల నెల పెన్షన్లు ఇస్తున్నాం.. తల్లికి వందనం ఇచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం.. గామన్ బ్రిడ్జ్ వద్ద కలకలం

సాయంకాలం.. సాగరతీరం

For More AP News And Telugu News

Updated Date - Aug 11 , 2026 | 08:13 AM