Share News

కేజీబీవీలో 40 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఘటనపై మంత్రి సత్యకుమార్ ఆరా

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:24 PM

అనంతపురం జిల్లా గుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు.

కేజీబీవీలో 40 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఘటనపై మంత్రి సత్యకుమార్ ఆరా
Minister Satyakumar Yadav

అమరావతి, నవంబర్ 17: అనంతపురం జిల్లా గుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు. ఈ ఘటనపై ప్రజారోగ్య సంచాలకుడు ఆర్. వెంకటరమణ, జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గత రాత్రి భోజనంలో సాంబారు తిన్న తర్వాత సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు మంత్రికి అధికారులు వివరించారు. నలుగురు విద్యార్థులను గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశామన్నారు.


మిగిలిన విద్యార్థులకు వసతి గృహంలోనే అవసరమైన వైద్య సేవలు, లక్షణాలను బట్టి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రికి అధికారులు వివరించారు. పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాలని.. విద్యార్థులందరి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

రెండు తుపాన్లను ఎదుర్కొన్నాం.. ఈ తుపానుకు సన్నద్ధంగా ఉండాలి.. అధికారులతో హోంమంత్రి

బ్లో అవుట్ ఘటన.. తక్షణమే సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 02:58 PM