Share News

బైండోవర్ ఉల్లంఘించిన నిందితుడి అరెస్ట్.. జైలుకు తరలింపు: డీఎస్పీ

ABN , Publish Date - May 24 , 2026 | 04:09 PM

కృష్ణాజిల్లా గుడివాడలో బైండోవర్ ఉల్లంఘించిన గొల్లపల్లి పోతురాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించామని డీఎస్పీ పి. శ్రీనివాస్ వెల్లడించారు. సెక్షన్ 129(ఇ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్‌లో అతడు ఉన్నారన్నారు.

బైండోవర్ ఉల్లంఘించిన నిందితుడి అరెస్ట్.. జైలుకు తరలింపు: డీఎస్పీ

గుడివాడ, మే 24: కృష్ణాజిల్లాలో బైండోవర్ ఉల్లంఘించిన స్థానిక వాంబే కాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించామని గుడివాడ పట్టణ డీఎస్పీ పి. శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం గుడివాడలో డీఎస్పీ శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ.. సెక్షన్ 129(ఇ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్‌లో అతడు ఉన్నారన్నారు. మే 15న మళ్లీ నేరానికి పాల్పడటంతో అతడిపై క్రైమ్ నం.132/2025 కింద కేసు నమోదు చేశామన్నారు. ష్యూరిటీ కింద రూ.2 లక్షల నగదు కట్టలేనని పోతురాజు సమాధానం ఇచ్చారని చెప్పారు.


ఈ నేపథ్యంలో తహసీల్దార్ డిటెన్షన్ ఉత్తర్వులతో పోతురాజును వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ అరెస్ట్ చేశారని వివరించారు. గుడివాడ సబ్ డివిజన్‌లో 444 మందిపై బైండోవర్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బైండోవర్‌లో ఉన్నవారు నేరాలు చేస్తే జరిమానా, డిటెన్షన్, జైలు శిక్ష తప్పదని డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో పోతురాజు తొలిసారి బైండోవర్ ఉల్లంఘించిన నిందితుడిని డీఎస్పీ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి

For More AP News And Telugu News

Updated Date - May 24 , 2026 | 04:33 PM