ప్రముఖ విద్యావేత్త డా. మంగాదేవి కన్నుమూత.. మంత్రి నారా లోకేశ్ సంతాపం!
ABN , Publish Date - Nov 27 , 2026 | 08:34 PM
ప్రముఖ విద్యావేత్త, మంగాదేవి చిల్డ్రన్స్ యూనివర్స్, శ్రీవెంకటేశ్వర బాలకుటీర్ వ్యవస్థాపకురాలు డా. నన్నపనేని మంగాదేవి మృతిపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబర్ 27: ప్రముఖ విద్యావేత్త, మంగాదేవి చిల్డ్రన్స్ యూనివర్స్, శ్రీవెంకటేశ్వర బాలకుటీర్ వ్యవస్థాపకురాలు డా.నన్నపనేని మంగాదేవి మృతిపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. 'విద్యావేత్త డా. ఎన్. మంగాదేవి గారు భౌతికంగా మనకు దూరమయ్యారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పిల్లల పట్ల అపారమైన ప్రేమతో, విలువలతో కూడిన విద్యను అందించి, వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఆమె సేవలు ఎప్పటికీ మరువలేనివి. బాలకుటీర్, చేతన వంటి విద్యాసంస్థల ద్వారా ఆమె సమాజానికి ఎనలేని సేవలు అందించారు. మానవతామూర్తి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, బాలకుటీర్ కుటుంబం అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
డా. ఎన్. మంగాదేవి గారు ఇవాళ(శుక్రవారం) ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. విద్యావేత్తగా, మార్గదర్శకురాలిగా, మానవతామూర్తిగా ఆమె ఎన్నో సేవలు అందించారు. మంగాదేవి భౌతిక ప్రయాణం ముగిసినా, ఆమె ఆశయాలు, విలువలు, సేవలు తరతరాలకు చిరస్థాయిగా నిలుస్తాయని మంగాదేవి చిల్డ్రన్స్ యూనివర్స్ (MDCU) తెలిపింది. అనుబంధ సంస్థలు నవంబర్ 27 నుంచి 29 వరకు సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు వెల్లడించింది. బ్రాడీపేట, శ్యామలానగర్, చేతన, తెనాలి బాలకుటీర్ విద్యాసంస్థలతో పాటు ఉషోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నందన గ్రామీణ పాఠశాలలకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మంగాదేవి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి:
మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
ఎన్ని కుట్రలు జరిగినా కలిసే ఉంటాం.. కాంగ్రెస్‌తో విభేదాలపై అఖిలేష్ యాదవ్