Share News

డీలిమిటేషన్ బిల్లుకు శరద్ పవార్ పార్టీ మద్దతు.. కీలక ప్రకటన చేసిన జితేంద్ర అవ్హాద్..

ABN , Publish Date - Nov 27 , 2026 | 08:28 PM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు ఎన్సీపీ (శరద్ పవార్) మద్దతివ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ ప్రకటించారు. పార్టీ అధినేత శరద్ పవార్‌తో చర్చించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డీలిమిటేషన్ బిల్లుకు శరద్ పవార్ పార్టీ మద్దతు.. కీలక ప్రకటన చేసిన జితేంద్ర అవ్హాద్..
Sharad Pawar

ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు ఎన్సీపీ (శరద్ పవార్) మద్దతివ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ ప్రకటించారు. పార్టీ అధినేత శరద్ పవార్‌తో చర్చించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబరు 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (శరద్ పవార్) కీలక ప్రకటన చేసింది (NCP Sharad Pawar).


శుక్రవారం ముంబైలో శరద్ పవార్‌ను కలిసిన అనంతరం జితేంద్ర అవ్హాద్ మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ అనేది రాజ్యాంగపరమైన అవసరమని, దానికి ప్రత్యామ్నాయం లేదని శరద్ పవార్ గతంలోనే తనతో అనధికారిక చర్చల్లో చెప్పినట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అయితే, పార్టీ నాయకులు తమ తమ నియోజకవర్గాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని శరద్ పవార్ సూచించినట్లు తెలిపారు (Delimitation Bill 2026).


కాగా, జితేంద్ర అవ్హాద్ ప్రకటనకు భిన్నంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పందించారు (Lok Sabha Seats Increase). కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఇంకా తమకు అందలేదని, దాని పూర్తి వివరాలు పరిశీలించకుండా మద్దతు లేదా వ్యతిరేకత ప్రకటించలేమని చెప్పారు. బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత దాని నిబంధనలను అధ్యయనం చేసి పార్టీ అధికారిక వైఖరిని వెల్లడిస్తామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నామనే కారణంతో ప్రతి బిల్లును వ్యతిరేకించడం, అధికార పక్షంలో ఉన్నామనే కారణంతో ప్రతి బిల్లును గుడ్డిగా సమర్థించడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..


మూడేళ్లకు రూ.50 లక్షల కోట్లకు పైగా.. రష్యా చరిత్రలోనే భారీ రక్షణ బడ్జెట్..

Updated Date - Nov 27 , 2026 | 08:28 PM