మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
ABN , Publish Date - Nov 27 , 2026 | 07:24 PM
తమిళనాడులో సంచలనం సృష్టించిన కల్లకురిచ్చి మహిళా ఐఏఎస్ అధికారి వేధింపుల కేసులో టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో సంచలనం సృష్టించిన కల్లకురిచ్చి మహిళా ఐఏఎస్ అధికారి వేధింపుల కేసులో టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి వారెంట్ పొందిన ప్రత్యేక పోలీసు బృందం.. శుక్రవారం సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకుంది. కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడం, అనుచితంగా ప్రవర్తించడం, వంటి ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. కాగా మూడు రోజుల క్రితం అరుల్ విఘ్నేష్‌పై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నందుకు టీవీకే ప్రభుత్వాన్ని మదురై కోర్టు నిలదీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విఘ్నేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ను కాపాడేందుకు టీవీకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. కేసు వెనక్కు తీసుకోవాలని బాధితురాలిపై కొందరు ఒత్తిడి తెచ్చారని ఆయన తెలిపారు. మదురై కోర్టు జోక్యం వల్లే ఇప్పటికైనా అరెస్ట్ జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోకుండా 116 రోజులు ఆలస్యం చేసినందుకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వార్తలూ చదవండి
భారత్‌లో పాక్ క్రికెట్ ఆడనప్పుడు ఆ వెబ్ సిరీస్ ఎందుకు?: నటి ఖుష్బూ వ్యాఖ్యలు
ఎన్ని కుట్రలు జరిగినా కలిసే ఉంటాం.. కాంగ్రెస్‌తో విభేదాలపై అఖిలేష్ యాదవ్