తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్..
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:00 PM
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వ అధికారులపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వ అధికారులపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, మదురై జిల్లా కలెక్టర్‌తో పాటు ఆలయ ధర్మకర్తలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేకాదు శనివారం కొండపై దీపత్తూన వద్ద కార్తీక దీపం వెలగించాల్సిందేనని స్పష్టం చేసింది. (Thiruparankundram Deepam Row).
తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం, దర్గా భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్)కు అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి, ఆలయ నిర్వహణ పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రాజకీయ పెద్దల సూచనల మేరకు అధికారులు వ్యవహరించారనే ఆరోపణలపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 28న దీపత్తూన్ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాలని స్పష్టం చేసింది. కొత్తగా నియమించిన రిసీవర్లు ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని ఆదేశించింది (Supreme Court about Karthigai Deepam).
ఆలయ అధికారులు, సంబంధిత యంత్రాంగం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది (Deepathoon Controversy). కోర్టు ఉత్తర్వుల అమలుపై ఎలాంటి బేరసారాలకు తావులేదని ధర్మాసనం పేర్కొంది. ఆలయ ధర్మకర్తలు అనుమతి ఇవ్వకపోవడంతోనే దీపం వెలిగించలేకపోయామని మదురై జిల్లా కలెక్టర్ కోర్టుకు వివరించారు. ఈ విషయంలో క్షమాపణలు కూడా చెప్పారు. అయితే కలెక్టర్ వివరణ, క్షమాపణలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసింది. ధర్మకర్తలు అనుమతించలేదనే కారణంతో సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టడం కుదరదని పేర్కొంది.
నోటీసులు అందుకున్న 13 మంది వీరే..
1. డాక్టర్ ఎం. సాయికుమార్ – తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary)
2. డాక్టర్ మహేశ్ అగర్వాలా – తమిళనాడు డీజీపీ (Director General of Police)
దేవాదాయ శాఖ (HR&CE):
3. వి. రాజారాం – దేవాదాయ శాఖ కార్యదర్శి
4. టీజీ వినయ్ – దేవాదాయ శాఖ కమిషనర్
5. ఆర్. పొన్ స్వామినాథన్ – మదురై దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్
మదురై జిల్లా అధికారులు:
6. నిశాంత్ కృష్ణ – మదురై జిల్లా కలెక్టర్
7. ఎల్. దేవనాథన్ – మదురై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP)
ఆలయ అధికారి:
8. జి. సెల్వి – అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి (Executive Officer)
ఆలయ పాలక మండలి:
9. వి. షణ్ముగసుందరం – పాలక మండలి చైర్మన్
10. సి. రాజపాండియన్ – ట్రస్టీ
11. కె. అళగప్పన్ – ట్రస్టీ
12. కె. రెజినా దేవి – ట్రస్టీ
13. కె. చిత్ర – ట్రస్టీ
ఇవి కూడా చదవండి..
అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
మూడేళ్లకు రూ.50 లక్షల కోట్లకు పైగా.. రష్యా చరిత్రలోనే భారీ రక్షణ బడ్జెట్..