Share News

టీడీపీ నూతన కమిటీలు.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Apr 15 , 2026 | 09:40 PM

తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల్లో పదవులు పొందిన నేతలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లను గౌరవించుకుంటూ, కొత్తవారికి అవకాశం కల్పించామని ఆయన తెలిపారు.

టీడీపీ నూతన కమిటీలు.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
CM Chandrababu Naidu

అమరావతి: తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల్లో పదవులు పొందిన నేతలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లను గౌరవించుకుంటూ, కొత్తవారికి అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. మరోవైపు సామాజిక న్యాయం పాటిస్తూ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.


టీడీపీతో అనుబంధం, కష్టపడే తత్వం, యువ రక్తం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుని పార్టీ కమిటీలను నియమించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నిరంతరం రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే పార్టీగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఈ కొత్త కమిటీలు మరింత ప్రభావవంతంగా పని చేస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో పని చేయడమంటే రాష్ట్రాభివృద్ధికి పని చేయడమనే గొప్ప సంకల్పంతో ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగిసిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం.. డీలిమిటేషన్‌కు మద్దతు..

పోలీసులను ఎలా వాడుకున్నారో గుర్తు లేదా సజ్జల?: ఎమ్మెల్సీ కంచర్ల

Updated Date - Apr 15 , 2026 | 09:52 PM