Share News

క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం.. క్రీడాకారులకు మంత్రి లోకేశ్ హామీ..

ABN , Publish Date - Apr 15 , 2026 | 06:40 PM

మంత్రి నారా లోకేశ్ జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. క్రీడల్లో రానించటానికి కారణమైన తమ స్వీయ అనుభవాలను క్రీడాకారులు మంత్రి లోకేశ్‌తో పంచుకున్నారు.

క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం.. క్రీడాకారులకు మంత్రి లోకేశ్ హామీ..
Nara Lokesh Tirupati meeting

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. క్రీడల్లో రానించటానికి కారణమైన తమ స్వీయ అనుభవాలను క్రీడాకారులు మంత్రి లోకేశ్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రచిస్తామన్నారు. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా 3,132 కి.మీల మేర యువగళం పాదయాత్ర చేపట్టినపుడు యువత ఆశలు, ఆకాంక్షలు తెలిశాయన్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద 421మందికి పైగా ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు. రాష్ట్రంలోని బాలలకు ఫిట్ నెస్ లేకపోవడం క్రీడల్లో వెనుకబాటుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. దీనిని అధిగ‌మించేందుకు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తోపాటు తల్లిదండ్రుల స‌హ‌కారం అవ‌స‌రమన్నారు. వ్య‌క్తిగ‌తంగా కాకుండా వ్య‌వ‌స్థీకృతంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి గ్రోత్ కారిడార్ల పరిధిలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.


ఈ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారంటే..

ఈ భేటీలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, షట్లర్ పీవీ సింధు, అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, అథ్లెట్‌ యర్రాజీ జ్యోతి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ నమ్మాళ్వార్, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), పంగి కరుణ కుమారి (బ్లైండ్ క్రికెట్), ముసునూరి రోహిత్ లలిత్ బాబు (చెస్), షేక్ అర్షద్ (పారా సైక్లింగ్), కిల్లాక లలిత (పారా అథ్లెటిక్స్), తమిరి సూర్య చరిష్మ (బ్యాడ్మింటన్), తిరుమూరి గణేష్ మణిరత్నం (ఆర్చరీ), దండు పూజ (బ్యాడ్మింటన్), పి.శివారెడ్డి (ఖోఖో), ఇ. రజని (హాకీ), నవ్య కండేరి (బ్యాడ్మింటన్), కె.ద్వారకనాథ్ రెడ్డి (బాస్కెట్ బాల్), శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

కుమ్మరవాండ్లపల్లి గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కేకు కొత్త టెన్షన్..!

Updated Date - Apr 15 , 2026 | 07:24 PM