సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వైసీపీ నేత గిరీశ్ కుమార్ రెడ్డి అరెస్టు..
ABN , Publish Date - Apr 15 , 2026 | 07:51 PM
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ గిరీశ్ కుమార్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్టు చేశారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు ఇటీవల అరెస్టు చేయగా.. తాజాగా రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ గిరీశ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం కుప్పం కోర్టుకు అతన్ని తరలించారు.
సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు గాను వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అరెస్టు నేపథ్యంలో కుప్పం కోర్టుకు విజయవాడ నుంచి వైసీపీ పార్టీ లాయర్ పొన్నవోలు సుధారక్ రెడ్డి, వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. చిత్తూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్, మండల నాయకులు, కార్యకర్తలు న్యాయస్థానం వద్దకు వెళ్లారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కోర్టు విచారణ ప్రారంభించగా.. పొన్నవోలు వాదనలు వినిపిస్తున్నారు. పోలీసులు కూడా భారీగా చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
కుమ్మరవాండ్లపల్లి గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం.. క్రీడాకారులకు మంత్రి లోకేశ్ హామీ..