Share News

నాదెండ్ల భాస్కరరావు మృతిపై చంద్రబాబు, పవన్, లోకేశ్ సంతాపం

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:35 PM

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. నాదెండ్ల మనోహర్‌ను సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు.

నాదెండ్ల భాస్కరరావు మృతిపై చంద్రబాబు, పవన్, లోకేశ్ సంతాపం
Nadendla Bhaskar Rao Death

అమరావతి, ఏప్రిల్ 22: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు(Former CM Nadendla Bhaskar Rao) మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. నాదెండ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భవవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. భాస్కరరావు తనయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఫో‌న్‌ చేసి పరామర్శించారు సీఎం. భాస్కరరావు కుటుంబసభ్యులకు సీఎం, మంత్రి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా నాదెండ్ల భాస్కర రావు మృతిపై సంతాపం తెలిపారు.


భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలి: డిప్యూటీ సీఎం

‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని డిప్యూటీ సీఎం పవన్ ఆవేదన చెందారు. నాదెండ్ల భాస్కరరావు 70వ దశకం నుంచి ప్రజా జీవితంలో ఉన్నారన్నారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైనదని చెప్పుకొచ్చారు. విజయవాడ ఈస్ట్, వేమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి సేవలందించారని గుర్తుచేశారు. ‘నాదెండ్ల భాస్కర రావు కుమారుడు, నా సహచర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పితృ వియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలి’ అని కాంక్షించారు. మనోహర్‌కు, ఇతర కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

డ్రైవర్‌ హత్య కేసులో సాక్షులకు బెదిరింపులు.. అనంత బాబు కోసం పోలీసుల గాలింపు

వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది గత ప్రభుత్వమే: అశోక్ బాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 04:07 PM