ఆ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు లేకపోవడం సరికాదు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:53 PM
సమన్వయ లోపంతో వివిధ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతుండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవటం సరికాదన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 3: సమన్వయ లోపంతో వివిధ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతుండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవటం సరికాదన్నారు. వెలిగొండ, పోలవరం ఎల్ఎంసీ ప్రకటనల్లో మంత్రి రామానాయుడు ఫొటో లేకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. తప్పులు పునరావృతం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రారంభానికి జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో పని చేశాయన్నారు. రామానాయుడు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ పని బాగా చేశారంటూ అభినందించారు. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు కానుందని.. ఆంధ్ర పాప్ కార్న్, అరకు కాఫీ ప్రతి గ్రామానికి విస్తృతంగా వెళ్లాలని సూచించారు.
ఏపీలో ఎల్‌నినో పరిస్థితులను వివరిస్తూ ఈరోజే కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రతినెలా క్షేత్రస్థాయి పరిస్థితులు కేంద్రానికి నివేదిద్దామన్నారు. అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 76 శాతం, ప్రకాశంలో 70 శాతం మేర లోటు వర్షపాతం ఉందన్నారు. గత 30ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని చెప్పారు. తాగునీరు అందించటం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం, సీడ్ బాల్స్ విషయంలో మంత్రులంతా కార్యోన్ముఖులై పని చేయాలని సూచించారు. తాగునీటికి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవకాశం ఉన్న చోట నీటి స్టోరేజ్‌కు చర్యలు చేపట్టాలని తెలిపారు.
గ్రౌండ్ వాటర్‌ను అంచనా వేస్తూ అవసరం అనుకుంటే అదనంగా బోరు వేసేందుకు అనుమతినిద్దామని ముఖ్యమంత్రి అన్నారు. ఎల్‌నివో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండటానికి వీల్లేదన్నారు. తాగు నీటిని రవాణా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్‌డీపీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రతి మంత్రివర్గంలో ఎల్‌నినో ప్రభావంపై సమీక్షిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని
సోషల్ మీడియాలో జెన్ జీ క్రియాశీలకం..అందుకు తగ్గట్టుగా సిద్ధమవ్వాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News