శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్
ABN , Publish Date - Mar 19 , 2026 | 09:57 AM
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజయవంతంగా ముందుకు సాగాలంటూ సీఎం ట్వీట్ చేశారు.
అమరావతి, మార్చి 19: ఉగాది పర్వదినాన్ని(Ugadi Festival) పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), మంత్రి లోకేశ్(Minister Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రగతిలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉండాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం, మంత్రి ట్వీట్ చేశారు.
సీఎం చంద్రబాబు ట్వీట్
‘షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో పాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
అందరికీ సర్వశుభాలు కలగాలి: మంత్రి లోకేశ్
‘తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ సర్వశుభాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రజాసంక్షేమం, రాష్ట్ర ప్రగతిలో దేశంలోనే అగ్రస్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఇళ్లల్లో ఆయురారోగ్య ఆనందాల ఉత్సవం తీసుకొచ్చే ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ: మంత్రి లోకేశ్
ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? దీని ప్రత్యేకత ఏంటి?
Read Latest AP News And Telugu News