విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:30 AM
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
అమరావతి, మార్చి 19: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను(Ugadi Festival) ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పాల్గొన్నారు. వేదికపై జ్యోతిని వెలిగించి ఉగాది వేడుకలను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
వేడుకల్లో భాగంగా ఉగాది పచ్చడిని ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు స్వీకరించారు. అనంతరం మాడుగుల నాగఫణి శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? దీని ప్రత్యేకత ఏంటి?
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్
Read Latest AP News And Telugu News