Share News

గత ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం.. టీడీపీనే అండగా నిలిచింది: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Aug 18 , 2026 | 04:55 PM

బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బలహీనవర్గాలను అసెంబ్లీకి పంపారని.. స్థానిక సంస్థలలో 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం.. టీడీపీనే అండగా నిలిచింది: మంత్రి అచ్చెన్నాయుడు
Minister Atchannaidu

అమరావతి, ఆగస్టు 18: బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు(మంగళవారం) ఏపీ అసెంబ్లీలో బీసీ సాధికారత రిజర్వేషన్లపై మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బలహీనవర్గాలను అసెంబ్లీకి పంపారని.. స్థానిక సంస్థలలో 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 34 శాతం రిజర్వేషన్లను కల్పించారని గుర్తుచేశారు. గతంలో ఉన్న చట్టంలో మార్పు చేయాలంటే .. సవరణ చేయాలన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలపై దాడులు చేశారని, దమనకాండ చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీకి అండగా ఉన్న వర్గం బీసీలు అని అన్నారు. అందుకే బీసీలపై వైసీపీ కక్ష కట్టిందని విమర్శించారు.


బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పి రిజర్వేషన్లను పెంచారని, అయితే చట్టాన్ని మార్పు చేయాల్సి ఉండగా అలా చేయకుండా కొత్త జీవో ఇచ్చారని గత ప్రభుత్వంపై మంత్రి మండిపడ్డారు. ఆ రిజర్వేషన్లు వద్దు అని చెప్పి వైసీపీ సానుభూతిపరుడితోనే కోర్టులో కేసులు పెట్టించారన్నారు. కోర్టులో ఎదురుదెబ్బ తగిలితే సుప్రీంకోర్టుకు వెళ్లలేదని... తద్వారా బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. నేడు కేబినెట్ సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: మంత్రి సవిత

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 05:06 PM