ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటలకు 55.07 శాతం పోలింగ్.. కందూరులో అత్యధికం
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:04 PM
ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:00 గంటల వరకు 55.07 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 24,98,312 మంది ఓటర్లకు గాను 13,75,799 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయవాడ, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:00 గంటల వరకు 55.07 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 24,98,312 మంది ఓటర్లకు గాను 13,75,799 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ప్రకాశం జిల్లా కందుకూరులో అత్యధికంగా 68.89 శాతం పోలింగ్ నమోదు కాగా, నెల్లూరు జిల్లా గూడూరులో అత్యల్పంగా 48.53 శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 20 పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.

అత్యధిక పోలింగ్ నమోదైన టాప్-5 పట్టణాలు/నగరాలు ఇవే..
కందుకూరు (ప్రకాశం జిల్లా) - 68.89 శాతం
పొదిలి (మార్కాపురం జిల్లా) - 68.46 శాతం
ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా) - 68.14 శాతం
మంగళగిరి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) - 62.91 శాతం
బి. కొత్తకోట (అన్నమయ్య జిల్లా) - 62.47 శాతం
అత్యల్ప పోలింగ్ నమోదైన పట్టణాలు/నగరాలు
గూడూరు (నెల్లూరు జిల్లా) - 48.53 శాతం
రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి జిల్లా) - 48.58 శాతం
శ్రీకాకుళం (శ్రీకాకుళం జిల్లా) - 49.05 శాతం

జిల్లా/పట్టణాల వారీగా పూర్తి పోలింగ్ వివరాలు (మధ్యాహ్నం 3:00 గంటల వరకు):
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) - 62.43 శాతం
పొన్నూరు (గుంటూరు) - 61.01 శాతం
చింతలపూడి (ఏలూరు) - 60.52 శాతం
శ్రీకాళహస్తి (తిరుపతి) - 59.73 శాతం
రాజాం (విజయనగరం) - 59.42 శాతం
గుడివాడ (కృష్ణా) - 58.85 శాతం
నరసరావుపేట (పల్నాడు) - 57.98 శాతం
తణుకు (పశ్చిమ గోదావరి) - 57.55 శాతం
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) - 57.24 శాతం
బాపట్ల (బాపట్ల) - 56.60 శాతం
భీమవరం (పశ్చిమ గోదావరి) - 56.51 శాతం
అల్లూరు (నెల్లూరు) - 54.98 శాతం
కావలి (నెల్లూరు) - 54.04 శాతం
కాకినాడ (కాకినాడ) - 50.36 శాతం
తాడిగడప (కృష్ణా) - 50.36 శాతం
ఇవి కూడా చదవండి...
ఏపీ ఎన్నికలపై నిఘా.. 15,100 కెమెరాలతో పోలింగ్ కేంద్రాల లైవ్ స్ట్రీమింగ్: ఎస్ఈసీ
శ్రీవారికి కానుకగా 46 రకాల స్వర్ణాభరణాలు.. జాబితాలో ఏమున్నాయంటే?
Read Latest AP News And Telugu News