ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచో తెలుసా
ABN , Publish Date - Sep 21 , 2026 | 01:21 PM
ఏపీలోని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 21: ఏపీలోని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అయితే అక్టోబర్ 11న రెండో శనివారం, అక్టోబర్ 12న ఆదివారం కావడంతో పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. పండగ సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా, క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో సెలవుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఏబీఎన్ కథనంతో కదిలిన అధికార యంత్రాంగం.. ఎంజీఎంకు కలెక్టర్
తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest AP News And Telugu News