Share News

ట్రైన్‌లో ప్రయాణించి.. ఆపై సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు

ABN , Publish Date - May 22 , 2026 | 12:25 PM

రెండో వారం ‘నో వెహికల్ డే’ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ట్రైన్‌లో విజయవాడకు చేరుకున్న మంత్రి.. అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.

ట్రైన్‌లో ప్రయాణించి.. ఆపై సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు
Nimmala Rama Naidu

అమరావతి, మే 22: రెండో వారం ‘నో వెహికల్ డే’ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ఈరోజు(శుక్రవారం) పాలకొల్లు నుంచి ట్రైన్‌లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడకు మంత్రి చేరుకున్నారు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్‌పై వెళ్లారు. వరుసగా రెండో వారం కూడా నో వెహికల్ డే సందర్భంగా సుమారు 18 కిలోమీటర్ల మేర మంత్రి నిమ్మల సైకిల్ తొక్కారు. తాడేపల్లి దగ్గర నిమ్మలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఒకే సైకిల్‌పై ఇద్దరూ కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లారు.


జగన్ పిచ్చి తుగ్లక: మంత్రి నిమ్మల

జగన్ ఒక పిచ్చి తుగ్లక్ అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేదని.. ప్రజలే భయపడుతున్నారని తెలిపారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలు జగన్‌కు అలవాటన్నారు. అమరావతిలో జరుగుతున్న పనులు చూసి వైసీపీ అధినేతకు భయం మొదలైందని.. అందుకే అమరావతిపై విషం కక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే పొట్టేలు తలల స్థానంలో ప్రజల తలలు నరుకుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు 11 సీట్లు కూడా రావని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీశ్ రావు

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 04:30 PM