విజయవాడ సిట్ ఆఫీస్‌లో లొంగిపోయిన ముప్పిడి అవినాశ్‌రెడ్డి
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:23 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, పరారీలో ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డి విజయవాడ సిట్ ఆఫీస్‌లో లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే..
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు(Liquor scam case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, పరారీలో ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి గురువారం విజయవాడ(Vijayawada) సిట్ ఆఫీస్‌లో లొంగిపోయారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో A-7గా ఉన్న అవినాశ్‌రెడ్డి.. గతంలో ఏపీ హైకోర్టు(High Court)లో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి అవినాశ్ రెడ్డి పరారీలో ఉన్నాడు.
మంగళవారం జరిగిన విచారణలో ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని, ఈనెల 26వ తేదీ లోపల సంబంధిత విచారణాధికారి ముందు స్వయంగా లొంగిపోవాలని డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. చట్టం ముందు లొంగిపోయిన తర్వాతే నిబంధనల ప్రకారం సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే గురువారం విజయవాడ సిట్ ఆఫీస్‌లో లొంగిపోయారు అవినాశ్ రెడ్డి.
ఈ వార్తలూ చదవండి
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ
ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్ షురూ.. ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు