ఏపీ లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు జగనే: డోలా వీరాంజనేయ స్వామి
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:09 PM
మద్యపాన నిషేధం చేస్తామని మద్యాన్ని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకున్నారని గత వైసీపీ ప్రభుత్వంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లు దోచుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి, జూన్ 13: మద్యపాన నిషేధం చేస్తామని మద్యాన్ని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకున్నారని గత వైసీపీ ప్రభుత్వంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లు దోచుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు గొడ్డలి పార్టీ నాయకుడు జగనే అని వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం తయారు చేసి 30 వేల మంది మహిళల పుస్తెలు తెంచారని దుయ్యబట్టారు. చిన్నాన్నను చంపిన వ్యక్తికి ప్రజల ప్రాణాలు ఒక లెక్క కాదన్నారు.
కల్తీ మద్యం ద్వారా దోచుకున్న సొమ్ముతో సినిమాలు, వ్యాపారాలు చేశారని మంత్రి తెలిపారు. వైసీపీ మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు మద్యం రవాణా దోపిడీ చేశారని ఆరోపించారు. డొల్ల కంపెనీల ద్వారా రవాణా ఛార్జీలు పెంచి రూ.400 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో సురక్ష యాప్ ద్వారా నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలు గొడ్డలి పార్టీని తిరస్కరించిన విషయాన్ని గొడ్డలి పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌తో సూపర్ హిట్ కొట్టిందన్నారు. మద్యం కుంభకోణంలో తాడేపల్లి గేట్‌ను ఈడీ టచ్ చేసిందన్నారు. రాష్ట్రంలో శాశ్వతంగా గొడ్డలి పార్టీని ప్రజలు మూసి వేశారని డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
కామారెడ్డిలో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్
అన్ని వర్గాలకూ నాణ్యమైన వైద్య సేవలు: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telugu News