Share News

కామారెడ్డి‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:28 PM

కామారెడ్డి కాంగ్రెస్‌లో రోజురోజుకూ వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది.

కామారెడ్డి‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్
Kamareddy Congress controversy

కామారెడ్డి, జూన్ 13: కామారెడ్డి కాంగ్రెస్‌లో రోజురోజుకూ వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది. సొంత పార్టీ నేతలపై కామారెడ్డి జిల్లా ఎస్పీకి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందు ప్రియ ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి చేశారు. ఈ వ్యవహారంలో షబ్బీర్ అలీపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పట్టణ నేతలు తీవ్రంగా ఖండించారు.


ఈ మేరకు పట్టణ అధ్యక్షుడు సందీప్ ఓ వీడియోను విడుదల చేశారు. షబ్బీర్ అలీ నిబద్ధత ఏంటో కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసని సందీప్ అన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కార్యకర్తలను కాపాడుకున్నారని తెలిపారు. చిల్లర రాజకీయాలు ఆపకుంటే తగిన బుద్ధి చెబుతామంటూ వీడియోలో సందీప్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయి: రాంచందర్ రావు

విషాదం.. కారు చక్రాల కింద పడి మూడేళ్ల బాలుడి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 12:32 PM