Share News

మహిళా పైలట్‌కు వేధింపులు.. ఒక రాత్రి తనతో గడపాలంటూ..

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:24 AM

జిమ్ మేనేజర్ మహిళా పైలట్‌పై వేధింపులకు పాల్పడ్డాడు. ఒక రాత్రి తనతో గడపాలంటూ పైలట్‌పై ఒత్తిడి తెచ్చాడు. ప్రియురాలి సాయంతో పైలట్‌కు టార్చర్ చూపించాడు.

మహిళా పైలట్‌కు వేధింపులు.. ఒక రాత్రి తనతో గడపాలంటూ..
Sanath Nagar Harassment Case

హైదరాబాద్, జూన్ 13: ఓ జిమ్ మేనేజర్ మహిళా పైలట్‌పై వేధింపులకు పాల్పడ్డాడు. ఒక రాత్రి తనతో గడపాలంటూ పైలట్‌పై ఒత్తిడి తెచ్చాడు. ప్రియురాలి సాయంతో పైలట్‌కు టార్చర్ చూపించాడు. జిమ్ మేనేజర్ వేధింపులు భరించలేకపోయిన మహిళా పైలట్ పోలీసులను ఆశ్రయించింది. జిమ్ మేనేజర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సనత్‌నగర్‌కు చెందిన ఓ మహిళా పైలట్ స్థానికంగా ఉండే ఓ జిమ్‌కు వెళుతోంది. జిమ్ మేనేజర్ సంతోష్ గౌడ్ పైలట్‌పై కన్నేశాడు. జిమ్ ట్రైనింగ్ పేరుతో ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు.


ఒక రాత్రి తనతో గడపాలని పైలట్‌పై ఒత్తిడి తేసాగాడు. సంతోష్ గౌడ్‌ గర్ల్ ఫ్రెండ్ రజినీ కూడా ప్రియుడికి సహకరించింది. ఇద్దరితో ఒకేసారి ప్రైవేటు‌గా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అని పైలట్‌ను వేధించసాగింది. పైలట్ ఇందుకు ఒప్పుకోకపోవడంతో సంతోష్ గౌడ్ కక్ష పెంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెట్టి వేధించసాగాడు. రోజురోజుకు అతడి వేధింపులు పెరగటంతో బాధితురాలు తట్టుకోలేకపోయింది. పోలీసులను ఆశ్రయించింది. సంతోష్ గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఫిఫా ప్రపంచ కప్ 2026: అమెరికా సంచలన విజయం

సిరిసిల్ల ఎస్పీపై బండి సంజయ్ ఆగ్రహం.. ఎందుకంటే..

Updated Date - Jun 13 , 2026 | 11:34 AM