Share News

మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసు లేదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

ABN , Publish Date - Jun 13 , 2026 | 03:29 PM

మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నియంత దేశంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గాంధేయవాది, నిజాయతీకి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్ అని స్పష్టం చేశారు.

మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసు లేదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
Mahesh Kumar Goud

హైదరాబాద్, జూన్ 13: మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నియంత దేశంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌పై కేసు ఏమీ లేదని.. నోటీసు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రాజ్యసభలో బలం పెంచుకోవాలని కుట్రకు పూనుకున్నారని ఆరోపించారు.


గాంధేయవాది, నిజాయతీకి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్ అని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆఫీసు కల్పించుకుని కేసును తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ విషయంలో ఉరి వేసినా తప్పులేదన్నారు. ప్రధాని నియంతలా వ్యవహరించడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదన్నారు. బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మీనాక్షి తనకు సోదరి లాంటివారన్నారు. 24 గంటల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించకపోవడం విచారకరమని తెలిపారు.


మీనాక్షిని బలి చేశారని.. ఆమె విషయంలో కొంతమంది బీజేపీ నేతలు సానుభూతి తెలిపినట్లు తెలిసిందని మహేశ్ అన్నారు. బీజేపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శలు గుప్పించారు. లీకు వీరులు.. గ్రీకు వీరులు ఉంటే సీఎం సమగ్రంగా విచారిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని... అంత మాత్రాన కుట్రకు పాల్పడరన్నారు. ఓటు చోరీ చేసి.. ఇప్పుడు సీటు చోరీ చేశారంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని ఇంతలా దిగజారి ప్రవర్తించడం బాధాకరమని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు

హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 04:58 PM