Share News

హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

ABN , Publish Date - Jun 13 , 2026 | 02:30 PM

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీలో అద్దె ఇంట్లో బంగ్లా జాతీయులు నివాసం ఉంటున్నారు.

హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
Hyderabad Police

హైదరాబాద్, జూన్ 13: నగరంలోని జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీలో అద్దె ఇంట్లో బంగ్లా జాతీయులు నివాసం ఉంటున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించగా.. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేవని గుర్తించారు. ఇతర డాక్యుమెంట్లు లేకుండానే భారత్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.


దేశంలోని పలు ప్రాంతాల్లోనూ బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు వీరిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని మెదక్ జిల్లా జోగిపేట డిపోర్టేషన్ సెంటర్‌కు తరలించారు. వీరిందరినీ తిరిగి వారి దేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

కామారెడ్డి‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 03:46 PM