Share News

జహీరాబాద్‌లో విషాదం.. కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:27 PM

సంగారెడ్డి, జిల్లాలోని జహీరాబాద్ మండలం హో(తి)కె డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య చేసుకుంది.

జహీరాబాద్‌లో విషాదం.. కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య
Zaheerabad News

సంగారెడ్డి, జూన్ 13: జిల్లాలోని జహీరాబాద్ మండలం హో(తి)కె డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలు.. ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సదరు మహిళ కుటుంబంలో కొద్ది రోజలుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గర్భిణి.. దారుణమైన నిర్ణయం తీసుకుంది. రెండంతస్తుల ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భవనం పైనుంచి కిందకు దూకడంతో ఆమెకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.


సమాచారం అందుకున్న జహీరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్త, అత్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jun 13 , 2026 | 01:47 PM