కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్రానికి ఏపీ లేఖ
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:36 PM
కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది.
ఏలూరు, ఏప్రిల్ 20: కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20,000 ఎకరాలు తగ్గించేలా 48వ ఎన్‌బీడబ్ల్యూఎల్(NBWL) సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది. దీని వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని లేఖలో తెలిపింది.
ఫిబ్రవరి 24, 2026న జరిగిన ఏపీ మంత్రిమండలి సమావేశంలో కొల్లేరు అభయారణ్య సరిహద్దుల మార్పుపై సీఈసీ అనుమతి కోరాలని తీర్మానం చేసినట్లు వెల్లడించింది. కొల్లేరు లేక్ మేనేజ్‌మెంట్ అథారిటీ తన రెండు సమావేశాల్లోనూ ఎన్‌బీడబ్ల్యూఎల్(NBWL) సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచన చేసింది. 2018 నుంచి సరిహద్దుల మార్పుపై ఉన్న స్టేను ఎత్తివేసి, తదుపరి చర్యలకు అనుమతి ఇవ్వాలని సీఈసీకి అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి..
చంద్రబాబు ఎలాంటి విజ్ఞాలు లేకుండా ముందుకు సాగాలి: మంత్రి ఆనం
చంద్రబాబు వ్యక్తి కాదు సామూహిక శక్తి: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telugu News