Share News

జపాన్‌లో భూప్రకంపనలు.. సునామి హెచ్చరికలు జారీ..

ABN , Publish Date - Apr 20 , 2026 | 02:39 PM

జపాన్‌లో సోమవారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు అయింది.

జపాన్‌లో భూప్రకంపనలు.. సునామి హెచ్చరికలు జారీ..
Japan earthquake today

ఇంటర్‌నెట్ డెస్క్: జపాన్‌లో సోమవారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల మేరకు.. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు అయింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఉత్తర ఇవాట్ ప్రిఫెక్చర్‌లోని పసిఫిక్ మహాసముద్రంలో భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూప్రకంపనల కారణంగా టోక్యోతోపాటు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోని బిల్డింగ్‌లు కంపించాయి.


సునామీ హెచ్చరికలు జారీ..

ఈశాన్య తీరంలో సోమవారం సంభవించిన భూప్రకంపనల కారణంగా పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో 3 మీటర్ల(సుమారు 10 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ప్రధానంగా ఇవాటే, ఆమోరీ, హొక్కైడో ప్రిఫెక్చర్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రతీర ప్రాంతంలోని వారు వీలైనంత త్వరగా అక్కడినుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. సునామీ హెచ్చరికలు ఎత్తి వేసే వరకు సురక్షిత ప్రాంతాలను వీడరాదని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా జోఫ్రా ఆర్చర్‌..

అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి

Updated Date - Apr 20 , 2026 | 02:56 PM