Share News

ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:00 PM

ఫార్చ్యూన్ ఇండియా పత్రికలో మంత్రి నారా లోకేశ్‌పై వ్యాసం కోసం కోటి రూపాయలకుపైగా ప్రభుత్వ ధనం ఖర్చు చేశారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. లోకేశ్‌పై తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.

ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ
AP Government

అమరావతి, ఆగస్టు 10: ఫార్చ్యూన్ ఇండియా పత్రికలో మంత్రి నారా లోకేశ్‌పై వ్యాసం కోసం కోటి రూపాయలకుపైగా ప్రభుత్వ ధనం ఖర్చు చేశారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. లోకేశ్‌పై తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 18-1-2025న జారీ చేసిన జీవో.. ప్రపంచ ఆర్థిక సదస్సు(World Economic Forum -2025)లో ఏపీ పెట్టుబడి అవకాశాల ప్రచారం కోసం ఇచ్చిందని.. ఓ ఆంగ్ల ఛానల్‌కు చెల్లింపులు చేయాలని ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలే ఆ జీఓలో ఉన్నాయని ఏపీ సర్కార్ వెల్లడించింది.


ఫార్చ్యూన్ ఇండియా, CNBC TV రెండు వేర్వేరు సంస్థలని.. రెండింటికీ ఎలాంటి సంబంధం లేదని సర్కార్ వివరణ ఇచ్చింది. జీవోను వక్రీకరించి మంత్రి నారా లోకేశ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ప్రజలకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించడం నేరమని హెచ్చరించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. తప్పుడు పోస్టులను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం స్పష్టీకరించింది.


ఇవి కూడా చదవండి...

కృష్ణా జిల్లాలో పోక్సో కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

మిగిలిపోయిన అర్హులకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం: మంత్రి సవిత

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 04:09 PM