Share News

మిగిలిపోయిన అర్హులకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం: మంత్రి సవిత

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:23 PM

సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేతన్నల సేవలో పథకానికి ఇటీవలే శ్రీకారం చుట్టామని మంత్రి సవిత తెలిపారు. 71,536 మందికి రూ.25 వేల చొప్పున్న ఆర్థిక సాయం అందించామన్నారు.

మిగిలిపోయిన అర్హులకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం: మంత్రి సవిత
Minister Savitha

అమరావతి, ఆగస్టు 10: సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేతన్నల సేవలో పథకానికి ఇటీవలే శ్రీకారం చుట్టామని మంత్రి సవిత తెలిపారు. ఈరోజు(సోమవారం) రాష్ట్ర సచివాలయంలో నేతన్నల సేవలో పథకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకా మిగిలిపోయిన అర్హులను గుర్తించి అందరికీ రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల చొప్పున్న ఆర్థిక సాయం అందించామన్నారు. ఇంకా మిగిలిన అర్హులైన నేతన్నలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. 13,678 మంది నేతన్నల సేవలో పథకానికి దరఖాస్తులు చేసుకున్నారని.. వారిలో అర్హులను గుర్తించి నేతన్నల నేస్తం పథకం వర్తింపజేస్తామని వెల్లడించారు.


వారం రోజుల్లో మిగిలిపోయిన అర్హులకు కూడా రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అన్నారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. 50 ఏళ్లు నిండిన 85,678 మంది చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ సమీక్షలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధం పొడిగింపు..

కృష్ణా జిల్లాలో పోక్సో కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 03:29 PM