కృష్ణా జిల్లాలో పోక్సో కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:06 PM
కృష్ణాజిల్లా పెడనలో గురుకుల బాలికలపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కృష్ణాజిల్లా, ఆగస్టు 10: జిల్లాలోని పెడనలో గురుకుల బాలికలపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈరోజు(సోమవారం) ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 6న పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమయ్యారని తెలిపారు.
మచిలీపట్నం రుద్రవరంలోని టిడ్కో హౌసెస్ వద్ద బాలికలపై అత్యాచారం జరిగిందని ఎస్పీ అన్నారు. బాలికలపై ఇద్దరు ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని చెప్పారు. నిందితులను శారదానగర్‌కు చెందిన మద్దాల శ్యామ్ కిరణ్ (20), కొక్కిలిగడ్డ సిద్ధు(20)గా గుర్తించామన్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. 40 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
లండన్‌లో మంత్రి నారాయణ బృందం.. అమరావతి ఐకానిక్ భవనాలపై కీలక చర్చలు
ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
Read Latest AP News And Telugu News