Share News

అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ఏపీ సర్కార్

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:15 PM

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వం ఢిల్లీకి పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి, రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌కు శాసనసభ స్పీకర్ పంపారు.

అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ఏపీ సర్కార్
AP Govt

అమరావతి, మార్చి 28: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) ఢిల్లీకి పంపించింది. కేంద్ర హోం శాఖ మంత్రి, రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌కు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు(AP Assembly Speaker Ayyannapatrudu) తీర్మానాన్ని పంపించారు. అలాగే కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఏపీ చీఫ్ సెక్రటరీకి తీర్మానం కాపీని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పంపారు. ఈ తీర్మానాన్ని మెయిల్ ద్వారా పంపడంతో పాటు, నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి ద్వారా ఢిల్లీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీకి తీర్మానాన్ని పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా అమరావతిని మార్చే అవకాశం లేకుండా చేసే ఉద్దేశంతోనే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరిస్తూ ఏపీ శాసనసభ ఈరోజు ఏకగ్రీవ తీర్మానం చేసింది.


ఇవి కూడా చదవండి...

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

ఇకపై రాజధాని అమరావతికి ఇబ్బందులు ఉండవు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2026 | 06:02 PM