కడపలో వివాహేతర సంబంధం కలకలం.. అత్త గొంతు కోసిన అల్లుడు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:15 AM
వివాహేతర సంబంధం ఓ మహిళ దారుణహత్యకు దారితీసింది. అత్త గొంతు కోసిన అల్లుడు.. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కడప, అక్టోబర్ 4: వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ దారుణహత్యకు గురైంది. అత్త గొంతు కోసిన అల్లుడు.. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పోలీసుల కథనం మేరకు.. కడప జిల్లాకు చెందిన శంషాద్ బేగం అనే మహిళను ఆమె అల్లుడు శ్రీను అనే వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శంషాద్ బేగం వివాహేతర సంబంధం బయటపడడంతో ఆగ్రహించిన అల్లుడు ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. అల్లుడు శ్రీను స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విభిన్న చిత్రాలు అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు: పవన్ కల్యాణ్
సింగీతం శ్రీనివాసరావు మరణం చిత్ర సీమకు తీరని లోటు: మంత్రి దుర్గేశ్