Share News

చంద్రబాబు సంకల్ప బలానికి ప్రకృతి కూడా కదిలొచ్చింది: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Sep 24 , 2026 | 08:19 PM

ప్రజలకు మంచి చేయాలన్న ప్రభుత్వ సంకల్పలమే ప్రకృతిని సైతం కదిలించిందని రాష్ట్ర హోం శాఖామంత్రి అనిత అన్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో ఇంతటి భారీ వర్షాలు కురవడం యాదృచ్చికం కాదని ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

చంద్రబాబు సంకల్ప బలానికి ప్రకృతి కూడా కదిలొచ్చింది: హోంమంత్రి అనిత
homeminister anitha on cm

అమరావతి, సెప్టెంబర్ 24: ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావంతో తాగడానికి మంచినీళ్లు కూడా దొరకవేమోనన్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడం చాలా ఆనందంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో ఈ భారీ వర్షాలు కురవడం యాదృచ్చికం కాదని ఆమె అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృఢ సంకల్పానికే ప్రకృతి కరుణించిందని ఆమె కొనియాడారు.


ప్రతిపక్ష కుట్రలు, తప్పుడు ఆరోపణలు ఎన్ని ఎదురైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు వెళుతున్నారని అనిత పేర్కొన్నారు. ప్రకృతి సైతం ఆయన సంకల్పానికి ఆశీర్వాదం తెలుపుతుందా.. అన్నట్లుగా రాష్ట్రంలో వర్షాన్ని కురిపించదన్నారు. ఆ ఆశీర్వాదాలే నేడు గోదావరిలో నీళ్ల రూపంలో పరవళ్లు తొక్కుతోందని.. పోలవరం వైపు జలధారల రూపంలో పరుగులు తీస్తున్నాయని హోంమంత్రి వర్ణించారు.


చంద్రబాబా నాయకత్వంలో పనిచెయ్యడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అనిత తెలిపారు. చంద్రబాబుకు, రాష్ట్రప్రజలకు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి అనిత కోరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు.

Updated Date - Sep 24 , 2026 | 08:59 PM