అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం పర్యటన.. అభివృద్ధి పనులపై సంతృప్తి
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:44 PM
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) ప్రతినిధుల బృందం ఈరోజు (బుధవారం) పర్యటించింది. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసింది
అమరావతి, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) ప్రతినిధుల బృందం ఈరోజు (బుధవారం) పర్యటించింది. రాజధానిలో పనుల పురోగతిని పరిశీలించింది. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, అదనపు నిధుల విడుదలపై సమీక్ష నిర్వహించింది. భవిష్యత్ కార్యాచరణ, ప్రాజెక్టుల పురోగతిపై సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులతో చర్చలు జరిపింది. సామాజిక భద్రత, పర్యావరణ పరిరక్షణ, కార్మికుల భద్రత లాంటి అంశాలను ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా సమీక్షించింది.
ఈ సందర్భంగా రాజధాని రైతుల ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు ఆరా తీశారు. వైకుంఠపురం పంపింగ్ స్టేషన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమరావతిలో రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలను సందర్శించారు. కృష్ణా కరకట్ట ఈ-1 రహదారి, మందడం పంచాయతీలో అభివృద్ధి పనులపై పరిశీలన చేపట్టారు. సీడ్ యాక్సిస్ ఈ-3 రహదారి రెండు, మూడు దశల పనులపై ఆ ప్రతినిధులు క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతి పనుల పురోగతిపై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వార్తలూ చదవండి
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎన్నికల వేళ.. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఐజీ రాజకుమారి