విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:22 PM
మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పేరు ఆవిర్భావానికి ఆయన ముహూర్తం ఖరారు చేశారు. ఈ ఏడాది 11వ నెల (నవంబర్) 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు కొత్త పార్టీ పేరును ఆయన ప్రకటించనున్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ 20: మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పేరు ఆవిర్భావానికి ఆయన ముహూర్తం ఖరారు చేశారు. ఈ ఏడాది 11వ నెల (నవంబర్) 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు కొత్త పార్టీ పేరును ఆయన ప్రకటించనున్నారు. అందుకు విజయవాడలోని A కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ ప్రకటనను విజయసాయిరెడ్డి చేయనున్నారు. దసరా పండగ రోజు అమ్మవారి దీవెనలతో కొత్త పార్టీ ఏర్పాటు అంటూ.. తన పార్టీ లక్ష్యాలను సోషల్ మీడియా వేదికగా విజయసాయి రెడ్డి మంగళవారం ప్రకటించారు.
తన కొత్త పార్టీ ఏర్పాటు చేసే నెల, తేదీ, గంటలు, నిమిషాలు అన్ని 11 సంఖ్య వచ్చేలా ఆయన చూసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే వచ్చాయి. అందుకే 11 సంఖ్యతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విజయసాయిరెడ్డి ర్యాగింగ్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలు.. రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి: సీఎం చంద్రబాబు
గన్నవరం విమానాశ్రయం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
For More AP News And Telugu News