Share News

గన్నవరం విమానాశ్రయం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 10:46 AM

గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐషర్ వ్యాన్‌, బైక్‌ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గన్నవరం విమానాశ్రయం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
Gannavaram Road Accident

కృష్ణా జిల్లా: గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐషర్ వ్యాన్‌, ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌ను వేగంగా దూసుకొచ్చిన వ్యాన్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.


సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్, లోకేశ్..

ఉచితం ముసుగులో ఇసుకదందా

Updated Date - Oct 20 , 2026 | 10:49 AM