పల్నాడు ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
ABN , Publish Date - Sep 14 , 2026 | 08:06 PM
పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. సోమవారం నరసరావుపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సమక్షంలో ఇద్దరు మావోయిస్టులు కందర్ప దుర్గా ప్రసాద్, గొడ్డళ్ల లచ్చమ్మ లొంగిపోయారు.
నరసరావుపేట, సెప్టెంబర్ 14: పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. సోమవారం నరసరావుపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సమక్షంలో ఇద్దరు మావోయిస్టులు కందర్ప దుర్గా ప్రసాద్, గొడ్డళ్ల లచ్చమ్మ లొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్ స్వస్థలం విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం, లచ్చమ్మ స్వస్థలం పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా అని ఏఎస్పీ ఈ సందర్భంగా వివరించారు. వీరిద్దరు అర్బన్ డెన్ కీపర్లుగా పని చేశారని తెలిపారు.
దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన కోసం ఆపరేషన్ కగార్‌ను కేంద్రం అమలు చేసింది. అందుకు ఈ ఏడాది మార్చి31వ తేదీ తుది గడువుగా విధించింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు నిరంతరం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుస ఎన్‌కౌంటర్ల కారణంగా భారీగా మావోయిస్టులు మరణించారు. అలాగే వందలాది మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులకు వారిపై ఉన్న రివార్డులను ప్రభుత్వం అందజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాదగయ పుష్కరిణిలో యువకుడి మృతి.. స్పందించిన డిప్యూటీ సీఎం
బొమ్మదేవర.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
For More AP News And Telugu News