పాదగయ పుష్కరిణిలో యువకుడి మృతి.. స్పందించిన డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:00 PM
పిఠాపురంలోని పాదగయ పుష్కరిణిలో పడి యువకుడి మృతి చెందిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్14: పిఠాపురంలోని పాదగయ పుష్కరిణిలో పడి యువకుడి మృతి చెందిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాదగయా క్షేత్రానికి వచ్చే భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారికి స్పష్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులకు ఫోన్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ సీఎం పవన్ ఎక్స్ వేదికగా తెలిపారు. పాదగయ క్షేత్రంలోని కోనేరులో లోతు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందని పవన్‌కు అధికారులు వివరించారు.
పిఠాపురం మండలం కొత్త కందరాడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున దర్శనం నిమిత్తం పాదగయ వెళ్లారు. దర్శనానికి ముందు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పుష్కరిణిలో వారు దిగారు. ప్రమాదవశాత్తూ సాయి (22) పుష్కరిణిలో జారీ పడి.. గల్లంతయ్యాడు. దీంతో వెంటనే అతడి స్నేహితులు.. దేవస్థానం సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టే సరికే సాయి మరణించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
బొమ్మదేవర.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
For More AP News And Telugu News