టీడీపీ మహానాడు.. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా లోకేశ్
ABN , Publish Date - May 07 , 2026 | 08:30 PM
నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. ఈ నిర్వహణ కోసం వివిధ కమిటీలను పార్టీ హైకమాండ్ నియమించింది. మొత్తం 21 కమిటీలను నియమించింది. అందుకు సంబంధించిన వివరాలను గురువారం విడుదల చేసింది.
అమరావతి, మే 07: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇఫ్కో కిసాన్ సెజ్ వేదికగా టీడీపీ మహానాడు- 2026 ను నిర్వహించనున్నారు. ఈ మహానాడు నిర్వహణకు వివిధ కమిటీలను పార్టీ హైకమాండ్ నియమించింది. మొత్తం 21 కమిటీలను నియమించింది. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ నియమించింది. ఈ మహానాడు మే 27న ప్రారంభమై.. 29వ తేదీతో ముగియనుంది.
ఈ మహానాడు నిర్వహణ కోసం మే 6వ తేదీన ఇఫ్కో కిసాన్ సెజ్‌లో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటి రెండు రోజులు 20 వేల మంది డెలిగేట్స్ ఈ మహానాడుకు వస్తారని.. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ముగింపు సభకు దాదాపు ఏడు లక్షలకు పైగా కార్యకర్తలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. 21 కమిటీల వివరాలు
ఈ వార్తలు కూడా చదవండి..
వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత
మహిళా స్వయం సహాయక బృందాలకు గుడ్ న్యూస్ చెప్పిన సీతక్క
Read Latest AP News And Telugu News