ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు చుక్కెదురు.. నాన్ -బెయిల్ వారెంట్ జారీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:30 PM
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్‌పై గుంటూరు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో బిహార్‌లో ఐజీగా ఉన్న సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఏపీ పోలీసులు ఉన్నారు. కొంతకాలంగా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు సునీల్ నాయక్. గుంటూరు కోర్టులో పోలీసులు నిన్న (బుధవారం) నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం గుంటూరు కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్(NBW) జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ నాయక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పి.వి.సునీల్ కుమార్, పి.సీతారామాంజనేయులు, సునీల్ నాయక్ ప్రధాన నిందితులుగా ఉన్నారు.
ఈ వార్తలూ చదవండి
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ
ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్ షురూ.. ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు