Share News

87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:48 PM

ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుపైనా మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు అందింది. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు సందర్భంగా విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని మంత్రికి సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్..
Minister Nara Lokesh Praja Darbar

గుంటూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'ప్రజాదర్బార్'ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించారు. సాధారణ ప్రజలే కాకుండా టీడీపీ కార్యకర్తలు, నేతలు సైతం తమ సమస్యలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంతో ఓపికగా వారి సమస్యలు విని వినతులు స్వీకరించారు మంత్రి లోకేశ్.

Lokesh.jpg


ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుపైనా మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు అందింది. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు సందర్భంగా విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని మంత్రికి సిబ్బంది విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వల్ల నష్టపోయిన హైర్ బస్ యజమానుల బస్సులకు రీప్లేస్మెంట్ కల్పించి ఆదుకోవాలని యజమానులు కోరారు.

Lokesh2.jpg


వంశపారంపర్యంగా సంక్రమించిన తమ 2.63 ఎకరాల భూమిని ఆక్రమించారని మంత్రి లోకేశ్‌కు కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన ఎస్.చిన్న శివమ్మ ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారించి తమ భూమిని తిరిగిచ్చేలా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న మంత్రి లోకేశ్ వారి నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ ట్వీట్ చేశారు.

Lokesh3.jpg


ఈ వార్తలు కూడా చదవండి

కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతం: మంత్రి లోకేశ్..

ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం

Updated Date - Apr 08 , 2026 | 05:52 PM